Saturday, December 21, 2024

నీ కోసం చూస్తున్నానంటూ సిద్ధూకు భార్య ట్వీటు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్‌కు క్యాన్సర్ సోకింది. ఇది ఇప్పుడు తీవ్రస్థాయిలో రెండో దశలో ఉందని నిర్థారణ అయినట్లు స్వయంగా ఆమెనే తమ ట్విట్టర్‌లో తెలిపారు. అంతేకాకుండా సంబంధిత విషయాన్ని బాధాతప్తతతో ఇప్పుడు జైలులో ఉన్న భర్త నవ్‌జోత్ సిద్ధూకు తెలియచేశారు. ‘మా ఆయన చేయని నేరానికి జైలులో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఈ విషయం తెలియచేసుకోవల్సి వస్తోంది. ఆయనకోసం ప్రతిరోజూ ఎదురుచూస్తున్నాను. నిజానికి నీకన్న ఎక్కువగా నేనే తల్లడిల్లుతున్నారు. నీలోని బాధ తొలిగిపోవాలని, దీనిని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను.

ఇప్పుడు నాలో ఈ అవలక్షణం తలెత్తింది. ఇది చిన్నదే అనుకుంటాను’ అని భర్తకు పంపించిన సందేశాన్ని కూడా ఆమె ట్విట్టర్‌లో వెలువరించారు. అయితే ఇప్పుడు క్యాన్సర్ తీవ్రస్థాయికి చేరిందని నిర్థారణ అయినందున ఇక నీకోసం ఎక్కువగా వేచి ఉండలేనేమో అన్పిస్తోంది. ఇప్పుడు ఎందుకో కత్తి అంచుమీద వెళ్లుతున్నట్లుగా ఉంది. ఇది కలికాలకం కలియుగం నువ్వు ఏమీ చేయకుండానే జైలు పాలుకావడం, బెయిల్ కూడా రాకపోవడం వంటివాటికి ఎవరిని నిందించడానికి వీల్లేదు, ఇదంతా దేవుడి లీల అనుకుందామా అని నిట్టూర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News