Thursday, December 26, 2024

ప్రి క్వార్టర్స్‌లో సింధూ..

- Advertisement -
- Advertisement -

స్విస్: స్విస్ ఓపెన్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. స్టార్ షట్లర్ పివి సింధూ, ఎస్‌హెచ్ ప్రణయ్ ప్రీ క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. మహిళల విభాగంలో సింధూ 21-9, 21-16తో స్విట్టర్‌లాండ్‌కు చెందిన బెంజిరా స్టడెల్మాన్‌ను ఓడించి ప్రి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. తర్వాతి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమా వర్ధానీతో సింధూ తలపడనుంది. కాగా, 2022లో పివి సింధూ స్విస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఇక పురుషుల విభాగంలో ఎస్‌హెచ్ ప్రణయ్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ ఫైనలిస్ట్ షి యు కీ(చైనా)ను 21-17, 19-21, 21-17తో మట్టికరిపించాడు. ప్రీక్వార్టర్స్‌లో ప్రణయ్ ప్రాన్స్‌కు చెందిన క్రిస్టో పోపోవ్‌ను ఢీకొట్టనున్నాడు. కాగా, భారత సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ లీ చెక్ యూ(హాంకాంగ్)తో తలపనుండగా డబుల్స్‌లో సాత్విక్‌చిరాగ్ జోడీ తైవాన్‌కు చెందిన ఫాంగ్ చిస్‌ఫాంగ్ జెన్ లీ ద్వయంతో పోరాడనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News