- Advertisement -
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామాలో ఓ వ్యక్తిని హత్య చేశారు. సత్తయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. రాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -