Monday, December 23, 2024

కెసిఆర్ సారు ఉంటే చాలు, అదే మాకు పది వేలు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అంటేనే భారత రైతు సమితి అని కెటిఆర్ తెలిపారు. ఇవాళ కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతకు పెట్టుబడికి పది వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామన్నారు. రైతుల మనోగతం కోసం ఒక కెసిఆర్ సారు ఉంటే చాలు, మాకు అదే పది వేలు అని ప్రశంసించారు. వేరేటోళ్లను పొరపాటున నమ్మినా… తెలంగాణ మళ్లీ వందేళ్లు వెనక్కి వెళ్తుందని హెచ్చరించారు. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం, రీయింబర్స్‌మెంట్ సౌకర్యం మరో ఏడాది పాటు 2024 మార్చి 31 వరకు తెలంగాణ ప్రభుత్వం పొడిగించిందన్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు సేవలు అందనున్నాయని కెటిఆర్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News