Monday, December 23, 2024

ఎపికి రూ.41,338 కోట్ల కేంద్ర నిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.41,338 కోట్ల నిధులు రానున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదన ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించి రూ.8,077 కోట్ల నిధులు కేంద్రం కేటాయించినట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి వివిధ ప్రాయోజిత పథకాలు, కార్యక్రమాల కింద ఎపికి రూ. 19,794 కోట్ల నిధులు రానున్నాయన్నారు. ఆంధ్రపదేశ్ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.30 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు.

అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి రూ.40 కోట్లు కేటాయించగా, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.168 కోట్ల నిధులు ఎపికి కేంద్రం ద్వారా వస్తాయన్నారు. గుంటూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కి రూ.23.20 కోట్లు , అనంతపురం ప్రశాంతి నిలయానికి రూ. 12 లక్షల నిధులు కేంద్రం ఎపికి కేటాయించినట్లు మంత్రి బుగ్గన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News