- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే బిజెపి స్వాగతిస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నామ సంవత్సరం కాబట్టే.. రైతన్నలపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులను తిట్టడం బిఆర్‌ఎస్ నేతల అలవాటుగా మారిందని ఆయన దుయ్యబట్టారు.
శాసనసభలో కౌలు లేదు.. కౌలు రైతు లేడన్న బిఆర్‌ఎస్ నాయకులు ఎన్నికలు రాగానే కౌలు రైతులు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే బిజెపి స్వాగతిస్తోందన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య ఎంతో వ్యవసాయశాఖ కమిషనర్’ శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన కోరారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదని ఆయన వెల్లడించారు.
- Advertisement -