Wednesday, November 27, 2024

మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ఆదరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌కు మద్ధతు పెరుగుతోంది. ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదాలు గ్రామ, గ్రామాలకు విస్తరిస్తున్నాయి. ఈనెల 26వ తేదీన జరిగే బహిరంగ సభకు మహారాష్ట్ర రైతాంగం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఫర్బానీ జిల్లాలోని పలు గ్రామాల్లో బిఆర్‌ఎస్ మహారాష్ట్ర శాఖ విస్తృతస్థాయి సమావేశం మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మానిక్ రావు ఖదం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈనెల 26న జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఈ సమావేశం రైతులకు, ప్రజలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను మహారాష్ట్ర ప్రజలను ఆకర్శిస్తుండడంతో వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్ణయించింది. సిఎం, బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు కెసిఆర్ అధ్యక్షతన జరిగే సభకు లక్ష మంది హాజరవుతారని మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మానిక్ రావు ఖదం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News