మన తెలంగాణ/ హైదరాబాద్ : నగరవాసులకు ఎల్‌బినగర్ కుడివైపు ప్లైఓవర్ బ్రిడ్జి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. నగరంలో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్షంగా ఎస్‌ఆర్‌డిపిలో భాగంగా ఈ నిర్మించిన ఈ ప్లైఓవర్‌ను శనివారం మున్సిపల్ పరిపాలన, ఐటి, పరిశ్రమలు శాఖామంత్రి కె.తారక రామారావు ప్రారంభించనున్నారు. దీంతో హయత్‌నగర్, చింతలకుంట మీదగా దిల్‌సుఖ్‌నగర్ వచ్చే ప్రయాణికులు ప్రయాణం సాఫీగా సాగనుంది.
ఎల్బీనగర్ ఆర్ హెచ్ ఎస్ ఫ్లై ఓవర్ ను సివిల్ పనులు, యుటిలిటి షిప్టింగ్ తో పాటు భూసేకరణతో సహా మొత్తం రూ.32 కోట్లవ్యయంతో 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పు ( 3 లైన్ల ) జిహెచ్‌ఎంసి ఈ ప్లైఓవర్‌ను నిర్మించింది. ప్లైవర్ నిర్మాణం ప్రిబవరి చివరి నాటికే పూరైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవం ఆలస్యమైంది. విజయవాడ నుంచి నగరానికి వచ్చే ప్రయాణికులకు సిగ్నల్ రహిత ప్రయాణం అందించడమే లక్షంగా ఈ నిర్మించిన ఈ ప్లైఓవర్‌ను శనివారం ప్రారంభించబోతున్నట్లు మంత్రి కెటిఆర్ శుక్రవారం ట్విట్ చేశారు.