Friday, January 10, 2025

నదుల ప్రవాహాల తగ్గుదల

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: భూతాపం కారణంగా హిమానీనదాలు, మంచుపలకలు తిరోగమనం చెందడం వల్ల రాబోయే దశాబ్దాల్లో భారత దేశానికి అతి ముఖ్యమైన సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల ప్రవాహాలు బాగా తగ్గిపోతాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. “భూమిపై అన్ని ప్రాణులకు హిమానీనదాలు కీలకమైనవి. అయితే అవి సముద్రం ముంపునకు గురవుతున్నాయి. ఈరోజు అవి ప్రపంచంలో 10 శాతం వరకు విస్తరించాయి. హిమానీనదాలు ప్రపంచ నీటిశిఖరాలుగా కూడా ఉంటున్నాయి. ” అని ఆయన వాటి ప్రాధాన్యతను వివరించారు.

బుధవారం అంతర్జాతీయ హిమానీనదాల సంరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మానవ ప్రమేయ చర్యలు భూగోళం వేడిని ప్రమాదకర స్థాయిలకు తీసుకెళ్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. గ్రీన్‌ల్యాండ్ మంచు కవచం చాలా వేగంగా కరిగిపోతుండగా, అంటార్కిటికా మంచుఖండం ఏటా సరాసరిన 150 బిలియన్ టన్నుల మంచుఖండాల వరకు కోల్పోతోందని ఈ విధంగా ఏటా మొత్తం 270 బిలియన్ టన్నుల వరకు కోల్పోతున్నట్టు ఉదహరించారు.

ఆసియాలో పది ప్రధాన నదులకు హిమాలయాలే పుట్టిల్లని, తన పరిధి లోని 1.3 బిలియన్ ప్రజలకు తాజా మంచినీటి అందిస్తోందని చెప్పారు. హిమానీనదాలు, మంచుపలకలు రానున్న దశాబ్దాల కాలంలో నిరంతరం తిరోగమిస్తుంటే ఆ ప్రభావం సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదుల ప్రవాహాలు బాగా క్షీణించడానికి దారి తీస్తుందని హెచ్చరించారు. హిమాలయాలు కరిగి పాకిస్థాన్‌లో వరద బీభత్సం ఎలా ముంచుకు వచ్చిందో ప్రపంచం ఇప్పటికే సాక్షమైందని వ్యాఖ్యానించారు.

ఉప్పునీటి చొరబాటుతో సముద్ర మట్టాలు అమాంతంగా పెరిగి ఈ భారీ డెల్టా ప్రాంతాలను నిర్జనం చేస్తాయని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కేంద్రంలో ఐక్యరాజ్యసమితి నీరు, పారిశుధ్యం (20182028)దశాబ్ద కాల కార్యాచరణ అమలుపై సమగ్ర సమీక్ష సందర్భంగా సమితి 2023 జల సదస్సులో గుటెర్రస్ మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News