Friday, November 22, 2024

ఏప్రిల్ 08 న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ టు -తిరుపతి వందేభారత్ రైలుకు ముహూర్తం ఖరారయ్యింది. వచ్చేనెల 08వ తేదీన ప్రధాని మోడీ జెండా ఊపి చేతుల మీదుగా ప్రారంభంకానున్నట్టుగా దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కేంద్రం నుంచి సమాచారం అందిందని దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

నారాయణాద్రి రైలు సికింద్రాబాద్-, బీబీనగర్-, నల్గొండ,- మిర్యాలగూడ-, నడికుడి-, పిడుగురాళ్ల-, సత్తెనపల్లి-, గుంటూరు,- తెనాలి,- బాపట్ల-, చీరాల- ఒంగోలు,- సింగరాయకొండ-, కావలి-, నెల్లూరు,- గూడూరు,- వెంకటగిరి,- శ్రీకాళహస్తి-, రేణిగుంట,- తిరుపతి వరకు వెళ్తుంది. అయితే ఇదే రూట్‌లో వందేభారత్ రైలును నడుపనున్నట్టుగా తెలిసింది. శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక ఈ మార్గం నుంచి వందేభారత్‌ను నడుపుతారని తెలుస్తోంది.
కేవలం 7 గంటల్లోనే తిరుపతికి…
ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 140- నుంచి 150 కి.మీల వేగంతో కేవలం ఆరున్నర నుంచి ఏడు గంటల్లోనే తిరుపతికి చేరుకుంటుంది. సికింద్రాబాద్- టు తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ రేట్లను కూడా దక్షిణమధ్య రైల్వే అధికారులు ఖరారు చేసినట్టుగా తెలిసింది. జీఎస్టీ, తత్కాల్ సర్‌చార్జీతో కలిపి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1150లు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2వేలు దాటే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. రైలు నెంబరు, టైమింగ్స్‌తో పాటు టికెట్ల ధరలపై అతి త్వరలోనే స్పష్టత ఇస్తామని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News