Friday, November 22, 2024

దేశంలో తిరోగమనం.. ఇక్కడ పురోగమనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రశేణి వ్యాపార సంస్థలను ఆకర్షించడంలో కేంద్రం విఫలమవుతున్నా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. తెలంగాణను పెట్టుబడుల స్వర్గ ధామంగా ప్రపంచ వాణిజ్య వర్గాలు భావిస్తున్నట్లు ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ (ఈపిసి) తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 2021-22లో కొత్త పెట్టుబడులు అత్యధికంగా 150శాతం పెరిగినట్లు ఎంఎస్‌ఎఈ ఈపిసి నివేదించింది. ఈపిసి చైర్మన్ డిఎస్ రావత్ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 2020-21లో నూతన పెట్టుబడులు రూ. 31,274 కోట్లు కాగా పెట్టుబడులు అత్యధికంగా 150శాతం పెరిగి రూ.76,568కోట్లుకు పెరగినట్లు తెలిపారు. ప్రధానంగా ప్రైవేటు రంగ పెట్టుబడులు భారీస్థాయిలో రూ.60,618కోట్లుగా వెల్లడించారు.

కాగా వ్యవసాయ రంగం తెలంగాణలో బలంగా ఉండటంతో కొవిడ్ కాలంలోనూ రాష్ట్రంలో వృద్ధి పెరిగింది. సర్వత్రా వృద్ధి రేటు మందగిస్తే తెలంగాణ రాష్ట్రంలో 2.2శాతం వృద్ధిరేటు పెరిగినట్లు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ నివేదించింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు బలంగా ఉండటమే దీనికి కారణంగా పేర్కొంది. కృత్రిమ మేధ (ఎఐ), సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్, క్లౌడ్ తదితర విభాగాల్లో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు తెలంగాణ అనువైన ప్రదేశంగా పేర్కొన్నారు. అదేవిధంగాతెలంగాణలో సూక్ష్మ, మధ్యతరహా సెమీ అర్బన్ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయని ఎంఎస్‌ఎంఈ ఈపిసి తెలిపింది.

కాగా ఐటి ఎగుమతులు తెలంగాణ నుంచి రూ.66,276కోట్లు కాగా 2021-22నాటికి లక్షల కోట్లుకు పెరిగాయి. ఇదే కాలంలో ఐటి ఉద్యోగులు 3.71లక్షల నుంచి 7లక్షలకు పెరిగినట్లు నివేదికలో గణాంకాలు వెల్లడించాయి. అదేవిధంగా ఆరోగ్య, పర్యాటక రంగంలోనూ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి భారీసంఖ్యలో ఆయా దేశాల ప్రజలు వైద్యచికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News