- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.50 వరకు 2,652 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
ఈ పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు హాల్‌టికెట్లు అందచేయడంతో పాటు www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.
- Advertisement -