హైదరాబాద్: సీనియర్ నాయకుడు, టిఆర్‌ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరబోతున్నారు. ఆయన 2004 నుంచి 2009 వరకు అధికారంలో కాంగ్రెస్ ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు డి. అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ బిజెపి ఎంపీగా ఉన్నారు. డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరాక రాహుల్ గాంధీ అనర్హతపై నిరసనగా ‘సత్యాగ్రహ’లో కూర్చుంటారు.
‘రాహుల్ గాంధీ నా నాయకుడు. ఆయన ఎంపీగా ఎందుకు అర్హుడు కాదు? ఆయన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. వారి కుటుంబానికి దేశాన్ని నడిపే మంచి అనుభవం కూడా ఉంది. అర్హత గురించి ప్రశ్నించడం సరైనది కాదు. నేను నేడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను. కాంగ్రెస్ కొనసాగిస్తున్న నిరసనలో పాల్గొంటాను’ అని శ్రీనివాస్ తెలిపారు.
Hyderabad | Rahul Gandhi is my leader. How can you say that he doesn't have the eligibility (of being an MP)? Given the sacrifices made by that family & their experience, you can't question his eligibility: Former BRS MP, D Srinivas ahead of re-joining Congress
"I am joining the… pic.twitter.com/nsTL5iDRd2
— ANI (@ANI) March 26, 2023