Monday, December 23, 2024

కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మరాఠా నేతలు

- Advertisement -
- Advertisement -

లోహ: మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా లోహలో ఆదివారం బిఆర్ఎస్ బహిరంగసభ నిర్వహిస్తోంది. సభకు హాజరైన సిఎం కెసిఆర్ శివాజీ, అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్ సమక్షంలో పలువురు మరాఠా నేతలు బిఆర్ఎస్ లో చేశారు. ఎన్సీపి మాజీ ఎంఎల్ఏ శంకర్ రావు దోండే బిఆర్ఎస్ లో తీర్థం తీసుకున్నారు. పలు పార్టీలకు చెందిన నేతలకు కెసిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో లోహ బిఆర్ఎస్ సభాప్రాంగణం సందడిగా మారింది. లోహ సభకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో లోహలో బిఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్. దీంతో బిఆర్ఎస్ మహారాష్ట్రలో రెండో బహిరంగ సభ నిర్వహిస్తోంది. గతంలో నాందేడ్ లో బిఆర్ఎస్ సభ నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News