Monday, December 23, 2024

సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే ఓడినట్టు కాదు: రోజా

- Advertisement -
- Advertisement -

పులివెందుల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలిచాక మంత్రి రోజా మాట్లాడుతూ సింహం ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదని అన్నారు. ఒక ఎమ్మెల్సీ గెలిచినందుకే చంద్రబాబు చాలా హంగామా చేస్తున్నారని విమర్శించారు. ‘వైనాట్ పులివెందుల?’ అంటున్నారని, పులివెందుల చెక్ పోస్టును కూడా తాకలేరని అన్నారు. ప్రజల మనసుల్లో జగన్ ఉన్నారన్నారు.

‘పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వీడినా తయారు చేసే దమ్మున్న శక్తి, యుక్తి జగన్ మోహన్ రెడ్డికి ఉంది. గతంలో పార్టీలో గెలిచి అమ్ముడు పోయిన వ్యక్తులు సూసైడ్ చేసుకున్న రోజులను దృష్టిలో ఉంచుకోవాలి. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎలా తిరుగుతారు. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే.. ఓడిపోయినట్టు కాదు. రెట్టింపు బలంతో వేటాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 2024 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లకు 175 సీట్లు గెలవబోతుంది’ అని మంత్రి ఆర్. కె.  రోజా ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News