Monday, December 23, 2024

కరోనా స్వైర విహారం… 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

- Advertisement -
- Advertisement -

కరోనా స్వైర విహారం… 5 నెలల తరువాత రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
కొత్తగా 1890 మందికి కరోనా పాజిటివ్
మరో ఏడుగురి మృతితో మొత్తం మృతుల సంఖ్య 5.30,831
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ స్వైర విహారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 149 రోజుల తరువాత రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా కొత్తగా 1890 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9433 కి చేరింది. ఇంతకు ముందు గతేడాది అక్టోబర్ 28న ఒకే రోజులో అత్యధికంగా 2,208 మందికి కొవిడ్ సోకింది. మరో ఏడుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ముగ్గురు, మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు మృతి చెందగా, తాజాగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,30,831కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతానికి చేరగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి చేరింది. ఇప్పటివరకు 4,47,00,147 మందికి వైరస్ సోకింది. రికవరీ రేటు 98.79 శాతానికి చేరింది. ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సినున్ల వేసినట్టు ఆరోగ్యశాఖ వివరించింది.

కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సదుపాయాలు, చికిత్సకు సన్నద్ధతను సమీక్షించడానికి ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశ వ్యాప్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు అడ్వైజరీని జారీ చేసింది. మాక్‌డ్రిల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు పాల్గొంటాయని, సోమవారం జరగనున్న వర్చువల్ మీటింగ్‌లో మాక్‌డ్రిల్ వివరాలు రాష్ట్రాలకు తెలియజేయనున్నట్టు వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహ్ల్ సంయుక్తంగా విడుదల చేసిన అడ్వైజరీలో కొవిడ్ పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. అలాగే ప్రజలు కొవిడ్ భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలకు మాస్క్ ధరించి వెళ్లాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వంటివి చేయరాదని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News