Monday, January 20, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ లో రాజేంద్ర కుమార్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ మండలం నేరేళ్ల చెరువుకు చెందిన రాజేంద్ర కుమార్ ను సిట్ అధికారులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ. 10 లక్షలకు ఒప్పందం కుదిరిందని సిట్ అధికారులు గుర్తిం చారు. రూ. 5 లక్షలు అడ్వాన్స్ గా రాజేంద్రకుమార్ ఇచ్చారన్నారు. తిరుపతయ్య అనే వ్యక్తి నుండి రాజేంద్రకుమార్ కొనుగోలు చేశారని సిట్ గుర్తించింది. ఉపాధి హామీ పథకంలో తిరుపతయ్యతో పాటు రాజేంద్రకుమార్ కిలిసి పని చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ప్రశ్నాపత్రం లీక్ అంశం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఇప్పటికే నాలుగు పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను టిఎస్‌పిఎస్‌సి వాయిదా వేసింది. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 12 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఆదివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల్లో నలుగురిని సిట్ బృందం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. టిఎస్ పిఎస్‌సి పేపర్ లీక్ అంశానికి సంబంధించి సిట్ బృందం విచారణ చేస్తుంది. పేపర్ లీక్ అంశానికి సంబంధించి కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News