Saturday, November 23, 2024

ఆ పని చేస్తే మహారాష్ట్రకు రాను: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళతానని కెసిఆర్ పేర్కొన్నారు.  మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం ఫడ్నవీస్ కు సవాల్ విసిరారు. ఈ ఐదింటిని మహారాష్ట్రలో అమలు చేయాలని కెసిఆర్ ఫడ్నవీస్‌కు సూచించారు. 1.తెలంగాణ మోడల్ ప్రకారం రైతులకు ప్రతి ఎకరానికి రూ. 10వేలు పంట పెట్టుబడిగా అందించాలి. 2. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందించాలి. 3. రైతులకు తెలంగాణలో ఇచ్చినట్టు ఉచితంగా సాగునీరు అందించాలి. 4. రైతులు ఏదైనా కారణంతో మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం అందించాలి. 5. రైతులు పండించిన పంటలను తెలంగాణలో ఒక్కో గింజను కొన్నట్లుగా ప్రభుత్వమే కొనాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.

తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు తాను వస్తూనే ఉంటానన్నారు. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే తాను మహారాష్ట్ర రానని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో దళితబంధు ఇస్తున్నామని, మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేస్తే తాను రానని కెసిఆర్ ప్రకటించారు. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News