Monday, December 23, 2024

మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ..అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బిజెపి 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టిఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మన కళ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారడం లేదు. నాయకులు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చని కెసిఆర్ తెలిపారు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని, మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతామన్నారు.

దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయని, దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉందని, దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్‌ను సులభంగా ఇవ్వొచ్చన్నారు. 125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉందనీ, అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని కెసిఆర్ ప్రశ్నించారు. పిఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుందని, పిఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదనీ, బతుకులపై ఆలోచన సభ అని, యూపీ, పంజాబ్‌లో నాయకుల మాయమాటలకు అక్కడి ప్రజలు మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News