డబ్లూపిఎల్ ఛాంపియన్ ముంబయి
బ్రంట్ అజేయ అర్ధశతకం
ఫైనల్లో ఢిల్లీపై 7వికెట్లతో గెలిచిన ముంబయి ఇండియన్స్
ముంబయి: డబ్ల్యూపిల్ తొలి సీజన్ టైటిల్‌ను ముంబయి ఇండియన్స్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ముంబై విజయంలో బ్రంట్ 55బంతుల్లో 7ఫోర్లుతో 60పరుగులు చేసి కీలకపాత్ర పోషించగా కెప్టెన్ కౌర్ 37పరుగులు చేసి తనవంతు సహకారాన్ని అందించింది. కాగా, టాస్ గెలిచి ప్రారంభించిన ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీవర్మ వెనుదిరిగి నిరాశపరిచింది. వాంగ్ బౌలింగ్‌లో రెండో ఓవర్ మూడో బంతికి అమీలా కెర్‌కు క్యాచ్ ఇచ్చి అనంతరం క్యాప్సీ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకుంది.
ఈక్రమంలో కెప్టెన్ మెగ్‌లానింగ్ ఇన్నింగ్స్‌ను రోడ్రిగ్స్‌తో కలిసి గాడిలో పెట్టేందుకు యత్నించింది. అయితే రోడ్రిగ్స్ 9పరుగులు చేసి వాంగ్ బౌలింగ్‌లో అమన్‌జ్యోత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చింది. ఈక్రమంలో 73పరుగుల స్కోరువద్ద అమీలా కెర్ బౌలింగ్‌లో భాటియాకు క్యాచ్‌ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. తర్వాతి ఓవర్లో యస్తికా భాటియా రనౌట్ అయింది. తనియా, అరుంధతి రెడ్డి కూడా డకౌట్ అయ్యారు. జోనాసెన్(2), మిన్ను మని(1) పరుగులు చేశారు. కెప్టెన్ మెగ్‌లానింగ్ (35)పోరాడి రనౌట్ అవగా చివర్లో షిఖాపాండే రాధాయాదవ్ 27పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో స్కోరు 131పరుగులుకు చేరింది. మొత్తంమీద ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి చేసింది. ముంబయి బౌలర్లలో వాంగ్, మాథ్యూస్ చెరో 3వికెట్లు పడగొట్టగా రెండు వికెట్లు తీసింది.
బ్రంట్ దూకుడు
ఢిల్లీ నిర్దేశించిన లక్ష్య ఛేదనలో మాథ్యూస్(13), యస్తిక భాటియా ఓపెనింగ్ జోడీ అందించడంలో విఫలమైంది. ఈనేపథ్యంలో ముంబయి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 39బంతుల్లో 5ఫోర్లుతో 37పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. మరోవైపు దూకుడుగా ఆడిన సివర్ బ్రంట్ బౌండరీలతో విరుచుకుపడి జట్టును విజయపథంలో నిలిపింది. హాఫ్‌సెంచరీతో ముంబైను గెలుపు తీరాలకు చేర్చింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 6బంతులకు 5పరుగులు అవసరం కాగా బౌలింగ్‌లో మూడో బంతికి విన్నింగ్ షాట్‌గా బంతిని బౌండరీలైనుకు పంపిన బ్రంట్ జట్టును గెలిపించింది. మొత్తంమీద 19.3ఓవర్లలో 3వికెట్లకు 134 పరుగులు చేసి గెలుపొందింది. బ్రంట్ కెర్(14) నిలిచారు. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై 7వికెట్ల తేడాతో గెలిచి డబ్ల్యూపిల్ తొలి సీజన్ విజేతగా అవతరించింది.