Monday, December 23, 2024

రెడ్‍మీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ విడుదల

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమీ ఇండియా సరికొత్త రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీని విడుదల చేసింది. ఫైర్ టీవీతో వైవిధ్యమైన పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియో వంటి అత్యుత్తమ వినోద అనుభవాలను అందిస్తుంది. రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32‘ ధర రూ.13,999గా నిర్ణయించారు. ఇది ఎంఐ.కామ్, అమెజాన్‌పై లభ్యమవుతుంది. రెడ్‍మీ ఫైర్ టీవీ బెజిల్‍లెస్ డిజైన్‍తో రానుంది. అంటే ఈ టీవీ డిస్‍ప్లే చుట్టూ అంచులు చాలా సన్నగా ఉంటాయి. మెటాలిక్ బాడీతో ఈ టీవీ వస్తోంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉంటాయి. మొబైల్‍ సహా ఇతర డివైజ్‍ల నుంచి టీవీకి స్క్రీన్ కాస్ట్ చేసేందుకు మిరాకాస్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. యాపిల్ ఎయిర్ ప్లే కూడా ఈ టీవీలో ఉంటుంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‍కు సపోర్ట్ చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News