న్యూస్‌డెస్క్: ప్రముఖ మలయాళీ నటుడు, మాజీ ఎంపి ఇన్నోసెంట్ ఆదివారం రాత్రి కోచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. 75 సంవత్సరాల ఇన్నోసెంట్ 700కు పైగా చిత్రాలలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అనేక చిత్రాలను ఆయన నిర్మించారు. గతంలో క్యాన్సర్‌బారిన పడి కోలుకున్న ఇన్నోసెంట్ కరోనా వైరస్ సోకడంతో న్యూమోనియా బారినపడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో చాలకుడి నుంచి సిపిఎం అభ్యర్థిగా గెలుపొందిన ఇన్నోసెంట్ పార్లమెంట్‌లో తన వాణిని బలంగా వినిపించారు. మలయాళ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందచేసిన ఆయన గతంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ యాక్టర్స్(అమ్మ)కు అధ్యక్షుడిగా 18 సంవత్సరాలు పనిచేశారు. వృద్ధ సినీకళాకారులకు ఆయన పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇన్నోసెంట్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు.