Thursday, April 17, 2025

బండి సంజయ్ ఇంట తీవ్ర విషాదం.. పరామర్శించిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షలు, ఎంపి బండి సంజయ్ అత్తమ్మ కుకట్ల వనజ సోమవారం కన్నుమూశారు. దీంతో బండి సంజయ్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత రెండ్రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వనజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జ్యోతినగర్ లోని వారి స్వగృహంలో కుకట్ల వనజ పార్థీవదేహానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు, బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ నివాళుల‌ర్పించారు. అనంత‌రం బండి సంజయ్, సతీమణి అపర్ణతోపాటు డాక్టర్ వంశీని మంత్రి గంగుల ప‌రామ‌ర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News