Saturday, December 21, 2024

క్షణికావేశం..అనాధలుగా మారిన చిన్నారులు

- Advertisement -
- Advertisement -

కాసిపేటః కట్టుకున్న భార్యపై అనూమానమే పెను భూతంగా మారి వారి వివాహిత జీవితాల్లో చిచ్చు రేపింది. తరుచుగా గొడవలు పడుతున్న భార్య భర్తల మద్య క్షణిక ఆవేశం భర్త ప్రాణం తీయగా, భార్య జైలు పాలు కానుంది. ఈ నేపద్యంలో వారి ఇద్దరు పిల్లలు ఆలన, పాలనకు కరువయ్యారు. కాసిపేట మండలం కోనూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని తంగళ్లపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి దుంపల మహేష్, దుంపల లావణ్య ల మద్య జరిగిన వివాదంలో లావణ్య తన భర్త మహేష్‌ను రాడ్డుతో కొట్టడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు . పోలీసులు విచారణ చేపట్టి దుంపటి లావణ్యను అదుపులోకి తీకుకున్నారు.

దీంతో వారి 12 సంవత్సరాల కూతురు దుంపటి మహాలక్ష్మీ, 9 ఏండ్ల సిద్దార్థ్ ఆలన పాలనకు కరువయ్యరు. దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన ఆదివారం నెలకొంది. మహేష్ మద్యం మత్తులో తరచుగా లావణ్యను అనుమానిస్తు గొడవ పడే వారని కుటింబీకులు తెలిపారు. ఆదివారం సాయంత్రం కూడా మహేష్, లావణ్యల మధ్య గొడవ జరిగినట్లు కుటింబీకులు తెలిపారు. లావణ్య తన అత్తగారి ఇంటికి(కోనూర్)కు వెళ్లగా సాయంత్రం మహేష్ వెళ్లి భార్య లావణ్యను తనతో రమ్మని చెప్పగా లావణ్య అత్తగారి ఇంటి వద్దనే ఉంటానని తెలిపినప్పటికి మహేష్ తనతో లావణ్యను తీసుకొని వెళ్లినట్లు మహేష్ తండ్రి పోషం తెలిపారు. మళ్లీ ఇంటికి వెళ్లిన తరువాత మహేష్ తన ఇంటిలోని వస్తువులను, కరెంట్ తీగను గొడ్డలితో నరికి వేసాడు.

తన భార్య లావణ్యపై కూడా గొడ్డలితో దాడి చేసేందుకు యత్నించగా, లావణ్య ఇనుప రాడ్డుతో మహేష్ తలపై కొట్టడంతో కుప్పకూలీ పోయాడు. దీంతో లావణ్య సమీపంలోని వారికి సమాచారం ఇవ్వడంతో వారు 1౦8 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.  స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి మహేష్ మృతి చెందినట్లు చెప్పడంతో దేవాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దేవాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై విచారణ చేపట్టారు. రాత్రి మందమర్రి సిఐ మహేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి, లావణ్యను అదుపులోకి తీసుకొని మహేష్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి మృతి చెందగా, తల్లిని పోలీసులు కస్టడికి తీసుకోవడంతో వారి కూతురు మహాలక్ష్మీ, కొడుకు సిద్దార్థ్ లు ఆలన పాలన లేకుండా మిగిలి పోయారు. దేవాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News