Sunday, December 22, 2024

ఆత్మాహుతి దాడిలో ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం సమీపంలో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాగా విదేశాంగశాఖ సమీపంలో దాడి జరగడం ఈ ఏడాది రెండోసారి. ఈ దాడికి పాల్పడింది తామే అని ఏ సంస్థ ప్రకటించకపోయినా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)గ్రూప్ దాడి చేసినట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆగస్టు 2021మధ్యకాలంలో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటినుంచి ఐఎస్ గ్రూప్ తాలిబన్ అధికారులు, దేశంలోని మైనారిటీ షియాలను లక్షంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు మరణించారని కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. గాయపడినవారిలో ముగ్గురు తాలిబన్ భద్రతా అధికారులు ఉన్నారని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News