Saturday, December 21, 2024

Medchal: జగద్గిరిగుట్టలో దంపతుల ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కుత్బుల్లాపూర్ ప్రాంతం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన రెండేళ్లకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరూ ట్రాన్స్ జెండర్లని స్థానికులు తెలిపారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కి చెందిన అనూష(25), గణేష్(25) ఇద్దరు జగద్గిరిగుట్ట ప్రాంతం శివ నగర్ లో నివాసముంటు కూలీ పనులు చేసుకుంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని, ఆత్మహత్య కు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News