Tuesday, November 26, 2024

తెలంగాణలో పారిశుద్ధ చర్యలు భేషు

- Advertisement -
- Advertisement -

కేంద్ర తాగునీరు, పారిశుద్ధ శాఖల కార్యదర్శి విన్నీ మహాజన్

మనతెలంగాణ/ హైదరాబాద్ : స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశుద్ధ్య చర్యలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ విభాగం తాగునీరు, పారిశుధ్ధ శాఖల కార్యదర్శి విన్నీ మహాజన్ ప్రశంసించారు. సోమవారం న్యూఢిల్లీలో జలశక్తి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వచ్చే సంవత్సరానికి గాను స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా అమలు చేయనున్న పలు కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి వివరించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలలో ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ, వెర్మీ కంపోస్ట్ ఎరువుల తయారు చేయడం, ఇంటిలోని వృధా నీటి ద్వారా పెరటి తోటలు, కూరగాయల పెంపకం, ఇంకుడు గుంతలు, వృధా నీరు భూమిలో ఇంకేలా చేయడం, నీరు నిల్వ లేకుండా దోమల బెడద అంటు రోగాల వ్యాప్తి నిర్మూలనపై చేపట్టిన కార్యక్రమాలను సందీప్‌కుమార్ సుల్తానియా కేంద్ర కార్యదర్శికి వివరించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీలో తయారు చేస్తున్న వర్మి కంపోస్ట్ ఎరువును కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వినీ మహాజన్ కు ఆయన అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కేంద్ర జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి జితేంద్ర శివాత్సవ, స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News