Monday, December 23, 2024

మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?

- Advertisement -
- Advertisement -

మేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో ఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?’. ఈ చిత్రంప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. హీరో మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, చోటా కె నాయుడు కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ కొల్లి గౌరవ దర్శకత్వం వహించారు. మంచు మనోజ్, బాబీ కొల్లి , చోటా కె నాయుడు టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ కెమెరామెన్‌గా పనిచేస్తుండగా.. స్టార్ కంపోజర్ గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు భవానీ శంకర్ మాట్లాడుతూ “ఈ సినిమాకు గోపిసుందర్ ఇచ్చిన పాటలన్నీ బ్లాక్‌బస్టర్ అవుతాయి. ఇందులో బ్రహ్మ పాత్ర సౌత్ ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో చేయబోతున్నారు. ఇది సోషియో ఫాంటసీ, మైథాలజీ, లవ్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌”’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News