Saturday, November 23, 2024

త్వరలో రూ.1300కోట్లు

- Advertisement -
- Advertisement -

తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
– కెటిఆర్, ఐటి మంత్రి

కెసిఆర్‌కు హ్యాట్రిక్ విజయం అందిద్దాం 100
అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరాలి దేశానికే తెలంగాణ ఆదర్శం పల్లె ప్రగతి ద్వారా మారిన రాష్ట్ర
ముఖచిత్రం: సిరిసిల్ల పర్యటనలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/ సిరిసిల్ల:  తెలంగాణను కేంద్ర ప్రభుత్వం శత్రుదేశంగా చూస్తూ ఆర్థిక ఆంక్షలు అ మలు చేస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన గ్రామీణ ఉపాధి హమీ నిధులు రూ.1200 కోట్లు ఇవ్వడం లేదని ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడు తూ తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ రా ష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధు లు తగ్గించిందన్నారు. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు, ప్రశంసలు అందిస్తోందని, కానీ, నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు.

విషయంలో ఎవరికైనా అ నుమానం ఉంటే ఆర్‌టిఐ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు. తెలంగాణలోని రూ. కోటిలోగా బ కాయిలున్న వాటి సమస్యలను పరిష్కరించడానికి గత నవంబర్, డిసెంబర్ వరకు బకాయిలు తీర్చడానికి ఈ నెల 31లోగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1300లు కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచామని, కేంద్రంతో రాష్ట్రానికి ఎన్ని రాజకీయ వైరుధ్యాలున్నా తప్పనిసరిగా దేశంలోని టాప్ 20 గ్రామపంచాయతీల్లో 19 తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రం ఒప్పుకోక తప్పలేదన్నారు. ఉత్తమ జిల్లా పరిషత్‌గా సిరిసిల్ల జిల్లా రెండుసార్లు జాతీయ స్థాయిలో అవార్డు అందుకుందన్నారు. గతంలో ఎక్కడో కేరళలో, లేదా అంకాపూరో, గంగదేవిపల్లో ఆదర్శగ్రామాలుగా ఉండేవని, స్వరాష్ట్రంలో సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో ఇప్పుడు 12,769 గ్రామపంచాయతీలు పల్లె ప్రగతి ద్వారా ఆదర్శంగా మారి అభివృధ్ధిలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయన్నారు.

ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని ఉత్తమ గ్రామాలను సందర్శిస్తున్నారన్నారు. 142 మున్సిపాలిటీల్లో 27 అవార్డులు సాధించాయని, సిరిసిల్ల ఒకప్పుడు మెట్ట, కరువు ప్రాంతంగా ఉండేదని, ఇటీవల తీసిన ‘బలగం’ సినిమాలో సిరిసిల్ల ప్రాంతం కోనసీమను తలతన్నేలా సెల్యూలాయిడ్‌పై కనిపించిందన్నారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోని ఉత్తమ గ్రామాలను సందర్శిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సుపరిపాలనపై ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రీ అకాడమీలో ఐఏఎస్ అభ్యర్థులకు పాఠాలు బోధించడం మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళాక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, జడ్‌పి సిపి అరుణ, శాసనసభ్యులు చెన్నమనేని రమేష్‌బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎంఎల్‌సి ఎల్ రమణ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు చైర్మన్ గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అతనపు కలెక్టర్ సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో బలగం సినిమా దర్శకుడు యెల్దండి వేణును మంత్రి కెటిఆర్ సత్కరించారు.

కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎం చేద్దాం..

దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా చరిత్ర సృష్టించి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ను చేయాలని, ఈ సంవత్సరం రానున్న ఎన్నికల్లో గులాబీదండు తెలంగాణలో 100 శాసనసభ స్థానాల్లో గెలిచి సత్తా చాటేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్లలో నిర్వహించిన బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రులుగా ఎన్‌టిఆర్, ఎంజిఆర్, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్‌రెడ్డి, జయలలిత వంటి వారు పని చేసినా వరుసగా మూడుసార్లు గెలిచిన చరిత్ర వారికి లేదని అందువల్ల మరోసారి కెసిఆర్‌ను గెలిపించుకోవాలని ఆయన సూచించారు. చరిత్రను ఎందరో సృష్టిస్తారని కానీ కెసిఆర్ చరిత్రతో పాటుగా భౌగోళికంగా తెలంగాణను కూడా సృష్టించారని కెటిఆర్ గుర్తు చేశారు. దేశ చరిత్రలో మొదటి సారిగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారితో చర్చించి వారికి హెక్టారుకు రూ.25 వేల సాయం చేసిన మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. త్వరలోనే ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలను ఇళ్ల నిర్మాణం కోసం అందిస్తామని కెటిఆర్ తెలిపారు. దళితబంధు విప్లవాత్మక పథకమని ప్రతినియోజక వర్గంలో 100 మందికి, హుజూరాబాద్ ఫైలట్ ప్రాజెక్టుగా అక్కడ 18 వేల యూనిట్లు మంజూరు చేసి ఇప్పటివరకు 4 వేల దళితబంధు యూనిట్లకు రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కళ్ల్లముందు కనిపించే అభివృద్ధిపై కార్యకర్తలు ప్రచారం సాగించాలన్నారు.
బొగ్గు దిగుమతిని యోగి ఆదిత్యనాథ్ కూడా వ్యతిరేకించారు..

ఏప్రిల్ 27వ తేదీన 22వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నామని, దీనివల్ల బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులు 60 లక్షల మంది ఉన్నారని, వారితో ఆత్మీయ సమ్మేళనాలు పది గ్రామాలకు ఒక యూనిట్‌గా నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో 1,72,000 మంది సభ్యులు న్నారని, ప్రతి సభ్యుడిని తట్టిలేపి వారందరూ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొనేలా చూడాలని కెటిఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తేదీన గ్రామగ్రామాన పార్టీ జెండాలను ఎగురవేయాల సూచించారు. అదానీకి ప్రయోజనం కలిగించేందుకు బొగ్గును ఆస్ట్రేలియా నుంచి పదింతల అధిక ధరకు కొనుగోలు చేసేందుకు మోడీ ఒత్తిడి తీసుకొచ్చారని దానిని యూపి సిఎం యోగి ఆదిత్యానాథ్ కూడా వ్యతిరేకించాడని కెటిఆర్ తెలిపారు. దేశంలో సరిపడే మన దగ్గర 3 వేల రూపాయలకే టన్ను బొగ్గు లభిస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News