Tuesday, December 24, 2024

ఏ ఆధారంతో వదిలేశారు?

- Advertisement -
- Advertisement -

బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషుల విడుదలపై సుప్రీం
సీరియస్ కేంద్రానికి, గుజరాత్‌కు నోటీసులు సంబంధిత ఫైళ్లతో
తదుపరి విచారణకు రావాలని ఆదేశం కొత్త బెంచ్ ఏర్పాటుకు అంగీకారం

న్యూఢిల్లీ: సామూహిక అత్యాచారం కేసులో 11మంది దోషులకు శిక్షతగ్గింపును సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గుజరాత్, కేంద్రప్రభుత్వాలు తమ స్పందన తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దోషులకు శిక్ష మినహాయింపు అనేక సమస్యలతో ముడిపడి ఉందని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఏ ఆధారంతో వారిని విడుదల చేశారని ప్రశ్నించింది. తదుపరి విచారణ తేదీనాటికి సంబంధిత ఫైళ్ల తో సిద్ధంగా ఉండాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈ నెల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ బిల్కిస్ బానో పిటిషన్ అంశాన్ని అత్యవసరంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో కొత్త బెంచ్ ఏర్పాటుకు సిజెఐ అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News