Sunday, January 19, 2025

Shoot: అమెరికాలో ఓ స్కూల్‌లో కాల్పులు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెనెస్సీ నాష్‌విల్లెలోని ఓ పాఠశాలలో ఓ యువతి కాల్పులు జరపడంతో ఆరుగురు మృతి చెందారు. మృతులు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. యువతి కాల్పుల్లో పోలీసులు అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ కాల్పుల్లో నిందితురాలు హతమైంది. ఘటన జరిగినప్పుడు స్కూళ్లో 200 మంది విద్యార్థులు ఉన్నారు. నిందితురాలు ఆ స్కూల్‌కు చెందిన మాజీ విద్యార్థి అడ్రూ హేల్‌గా గుర్తించారు. మృతులు సిందియా పీక్(61), క్యాథరీన్(60), మైక్ హిల్(61) టీచర్లుగా గుర్తించారు. ఈ స్కూల్‌ను 2001 స్థాపించారు. గత సంవత్సరం టెక్సాస్‌లోని వెల్డ్ ప్రాంతంలో ఓ స్కూల్‌లో కాల్పులు జరపడంతో 19 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు చనిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News