- Advertisement -
న్యూస్‌డెస్క్: తన తాత వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన మనవడు రంజిత్ సావర్కర్ మండిపడ్డారు. తన తాత బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారనడానికి రుజువులు ఏమిటో చూపాలని ఆయన రాహుల్ గాంధీకి సవాలు చేశారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
నా పేరు గాంధీ..సావర్కర్ కాదు..నేను క్షమాపణ చెప్పను అంటూ రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ సోమవారం స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలను చిన్నపిల్లల చేష్టలుగా ఆయన అభివర్ణిస్తూ బ్రిటిష్ పాలకులకు సావర్కర్ క్షమాపణ చెప్పారని రుజువు చేసే పత్రాలను చూపాలని రాహుల్‌ను ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎదగడానికి దేశభక్తుల పేర్లను వాడుకోవడం తప్పని ఆయన అన్నారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
- Advertisement -