Friday, November 22, 2024

గడువులోగా ఇల్లు ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తన అధికారిక నివాసం న్యూఢిల్లీ తుగ్లక్ లేన్‌లోని 12వ నంబర్ భవనాన్ని నిర్దేశించిన గడువులోగా ఖాళీ చేస్తానని తెలియచేస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ సచివాలయానికి లేఖ రాశారు. తన అధికారిక నివాసం రద్దయిందని తెలియచేస్తూ మార్చి 27న లేఖ రాసినందుకు లోక్‌సభ సచివాలయం మెంబర్స్ ఆఫ్ సరర్వీస్ బ్రాంచ్ డిప్యుటీ కార్యదర్శి మోహిత్ రాజన్‌కు రాసిన లేఖలో రాహుల్ ధన్యవాదాలు తెలియచేశారు.

నాలుగు పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ప్రజలు తనను ఎన్నుకున్నారని, ఈ నివాసంలో తాను గడిపిన క్షణాలు మధుర స్మృతులుగా మిగిలిపోతాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖలో మీరు పేర్కొన్న సమాచారానికి కట్టుబడి ఉంటానని మాజీ పార్లమెంట్ సభ్యుడిగా రాసి ఉన్న లెటర్‌హెడ్‌పై రాహుల్ ప్రత్యుత్తరమిచ్చారు.

17వ లోక్‌సభకు మార్చి 23 నుంచి అనర్హుడిగా రాహుల్ మారడంతో ఏప్రిల్ 23 నుంచి మీ అధికారిక నివాసం రద్దవుతుందని పేర్కొంటూ రాజన్ సోమవారం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన దరిమిలా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News