Monday, December 23, 2024

నా ఇంటికి రా భయ్యా.. ఇది నీ ఇల్లు అనుకో: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్‌కు రేవంత్ ఆహ్వానం

హైదరాబాద్ : రాహుల్ గాంధీ రాసిన లేఖపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. బంగ్లా ఖాళీ చేయనున్న రాహుల్ గాంధీకి రేవంత్‌రెడ్డి ఆత్మీయస్వాగతం పలికారు. రాహుల్ గాంధీని అన్నయ్య అని సంభోదిస్తూ తన ఇంటికి వచ్చేయాలని కోరారు. తన ఇంటికి వచ్చేయాలని, వెల్‌కమ్ చెప్పారు. ‘రాహుల్ భయ్యా, నా ఇల్లు.. మీ ఇల్లు. నా ఇంటికి వచ్చేయాలని మీకు స్వాగతం పలుకు తున్నాను.

మనమంతా ఒక కుటుంబం. ఇది మీ ఇల్లు కూడా’ అని ట్వీట్ చేశారు. మోడీ ఇంటి పేరు కేంద్రంగా గుజరాత్‌లోని సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ కాగా ఆ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష పడింది. రెండేళ్ల శిక్ష పడ్డ రాహుల్ గాంధీని లోక్‌సభ సెక్రెటేరియట్ నిబంధనలకు లోబడి పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించింది. అనంతరం, ఎంపిగా ఆయనకు కేటాయిం చిన ఢిల్లీలోని అధికారిక నివా సాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆదేశాలను పాటిస్తానని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. దీనికి భావోద్వేగ పూరితంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రియాక్ట్ అయ్యారు. తాను బంగ్లా ఖాళీ చేసి రాహుల్ గాంధీకి ఇస్తానని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి రియాక్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News