Monday, November 25, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: అధికారులు విధాలుగా తనిఖీలు చేపట్టి పట్టుకుంటున్నా అక్రమార్కులు విలువైన బంగారం తరలించేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. అంతకుమించి ఎత్తులు వేస్తున్న అధికారులు వారి ఆటలను కట్టిస్తున్నారు. తాజాగా, శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 66.24 లక్షల విలువైన 1.24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 02.55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ రూ. 51.24 లక్షలుగా ఉంటుందని కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. బంగారాన్ని పేస్టుగా చేసి మూడు క్యాప్సల్స్ రూపంలో తరలించేందుకు నిందితుడు యత్నించాడని తెలిపారు. మరో వ్యక్తి నుంచి కూడా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం 03.45 గంటలకు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 14.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. టూనా చేపల నూనె డబ్బాల మధ్య పెట్టుకుని ఈ బంగారాన్ని తరలించేందుకు నిందితుడు యత్నించాడని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News