Saturday, December 21, 2024

సీరియస్ పాయింట్‌ను వినోదాత్మకంగా..

- Advertisement -
- Advertisement -

షర్మన్ జోషి, శ్రియా శరణ్, షాన్, సుహాసిని మూలే, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మ్యాస్ట్రో ఇళయారాజా సంగీత సారధ్యం వహిస్తోన్న ఈ మల్టీ లింగ్వల్ మ్యూజికల్ మూవీ మే 12న రిలీజ్ అవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ పాపారావు బియ్యాల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరై సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ… “ప్రస్తుతం పిల్లలపై చదవు వల్ల ఎంత వత్తిడి పడుతుందనేది తెలియజేసే చిత్రమే మ్యూజిక్ స్కూల్. శ్రియా శరన్ మెయిన్ లీడ్‌గా చిన్న పిల్లలతో కలిసి ఈ సినిమా చేశారు”అని అన్నారు. దర్శకుడు పాపారావు మాట్లాడుతూ “ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు, టీచర్స్, సమాజం పిల్లలపై చదువు పేరుతో వత్తిడిని పెంచేస్తున్నారు. నిజానికి ఇదొక సీరియస్ పాయింట్. అయితే దీన్ని సంగీత రూపంలో వినోదాత్మకంగా చెప్పటానికి ప్రయత్నించాం”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News