Monday, December 23, 2024

శ్రీరామనవమి శుభాకాంక్షలు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి హరీష్ రావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీరామ నవమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారు అని.. శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందన్నారు. శ్రీరాముని అనుగ్రహముతో అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని… ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని నేడు మండుటెండల్లో కూడా చెరువులు, చెక్ డ్యామ్ లు మత్తళ్ళు దుంకుతున్నాయ్.. రైతులు ఆనందంతో పాడి పంటలతో రెండు పంటలు పండించి సంతోషంగా ఉన్నారు అనే సంతృప్తి ఉందని ఆకాంక్షించారు. సిద్దిపేట ప్రాంతం సస్యశ్యామలంగా విరాజిల్లాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాలని.. ప్రజలందరు ఆనందోత్సాహాల మధ్య సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News