Saturday, December 21, 2024

డెబ్బై ఏళ్ల తర్వాత భారత్ లో చీతాల జననం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అరుదైన వన్యప్రాణులైన చీతాలు (చిరుతపులుల్లో ఒక రకం) దాదాపు 74 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గతేడాది నమీబియా నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘అభినందనలు.. అమృత్ కాల్ సమయంలో మన వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన! 2022 సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశానికి తీసుకొచ్చిన చిరుతల్లో ఒకదానికి నాలుగు పిల్లలు పుట్టాయని, ఈ విషయాన్ని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను’ అని ట్విట్టర్ లో కేంద్ర మంత్రి తెలిపారు. డెబ్బై ఏళ్ల తర్వాత భారత్ లో చీతాలు జన్మించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News