Monday, December 23, 2024

రద్దయిన ఎఇఇ పరీక్ష తేదీలను ప్రకటించిన టిఎస్‌పిఎస్‌సి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎఇఇ) నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మే 9న అగ్రికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ పరీక్ష,

మే 21న సివిల్ ఇంజనీరింగ్ ఒఎంఆర్ పరీక్ష నిర్వహించిననున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 22న ఎఇఇ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి నిర్వహించగా, ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షలను రద్దు చేసింది. తాజాగా నియామక పరీక్ష తేదీలను టిఎస్‌పిఎస్‌సి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News