Saturday, November 23, 2024

మే 10న కర్నాటక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. బుధ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు ని ర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్, 13న ఓట్ల లెక్కిం పు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలకు ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఏప్రిల్ 20 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది.

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు …

రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. మొత్తం 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా “ఓటు ఫ్రమ్ హోం” సదుపాయాన్ని అందుబాటు లోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు… 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉన్నట్టు తెలిపారు.

శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత శాసన సభ గడువు మే 25వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 119 గా ఉండగా కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్‌ఎల్‌ఎలున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తుండగా, రాష్ట్రాన్ని తిరిగి తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని హస్తం పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తోపాటు జేడీఎస్ పార్టీ కూడా తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో తొలుత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే బల నిరూపణలో విఫలమవడంతో మూడు రోజులకే యడ్డీ దిగిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారం లోకి రాగా, ఎమ్‌ఎల్‌ఎల తిరుగుబాటుతో ఏడాదికే కుప్ప కూలింది. అనంతరం బీజేపీ మళ్లీ అధికార పగ్గాలు పట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News