Saturday, December 21, 2024

గుంటూరులో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఒకే సామాజిక వర్గం ఒకే గ్రామానికి చెందిన యువతి యువకుడు ప్రేమించుకున్నారు… ప్రేమ పెళ్లికి పెద్దలు వ్యతిరేకించడంతో రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చెబ్రోలు మండలం శలపాడు గ్రామానికి చెంది శ్రీకాంత్(20), త్రివేణి(19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకుంటామని ఇంట్లో వాళ్లకు చెప్పడంతో ఇరు వైపుల పెద్దలు వ్యతిరేకించారు. బతికి ఉండగా పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనుకొని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. త్రివేణి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి సోమవారం ఇంటికి రాకపోయేసరికి స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

శ్రీకాంత్ ఐటిఐ చదివి అనంతరం కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం శ్రీకాంత్ ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని వెళ్లినట్టు సమాచారం. సుద్దపల్లి రైల్వేగేటు వద్ద రెండు మృతదేహాలు కనిపించడంతో స్థానిక పోలీసులకు రైల్వే సిబ్బంది సమాచారం ఇచ్చారు. మిస్సింగ్ కేసుల ఆధారంగా త్రివేణి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహం తన కూతురిదేనని తల్లిదండ్రులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రేమ జంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News