Monday, December 23, 2024

రాహుల్‌కు జర్మనీ సంఘీభావంపై డిగ్గీ ధన్యవాదాలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధింపు, తదనంతరం పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటుకు సంబంధించి స్పందించినందుకు జర్మనీ విదేశాంగ మంత్రికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ ధన్యవాదాలు తెలియచేయడం వివాదాస్పదమైంది. జర్మనీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, ఆ శాఖ ప్రతినిధి రిచర్డ్ వాకర్‌కు ధన్యవాదాలు అంటూ దిగ్విజయ సింంగ్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని శిక్షించడం ద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా రాజీపడుతుందో పరిగణనలోకి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాహుల్ గాంధీకి సంబంధించిన తాజా పరిణామాలపై జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మొదిసారి వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు, పార్లమెంట్ నుంచి సస్పెన్షన్‌ను తాము గమనిస్తున్నామని, తీర్పు నిలబడుతుందా, సస్పెన్షన్‌కు ప్రాతిపదిక ఉందా అన్నది అప్పీలుతో తేలిపోతుందని ఆమె పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కేసులో న్యాయవ్యవస్థ స్వేచ్ఛా ప్రమాణాలు, ప్రజాస్వామిమిక సూత్రాలు వర్తిస్తాయని ఆశిస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు.

కాగా..లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతున్న బిజెపికి జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజా వ్యాఖ్యలు మరో అస్త్రం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దిగ్విజయ సింగ్ వ్యాఖ్యలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కరిణ్ రిజిజు స్పందిస్తూ భారతదేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీ శక్తుల జోక్యాన్ని రాహుల్ గాంధీ ఆహ్వానిస్తున్నారని విమర్శించారు. విదేశీ శక్తుల జోక్యం ద్వారా భారతదేశ న్యాయవ్యవస్థపై ప్రభావితం చేయలేరన్న విషయాన్ని గుర్తించాలని ఆయన చెప్పారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయిన కారణంగా విదేశీ ప్రభావాన్ని భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News