ఔరంగాబాద్: హిందూ, ముస్లిం వర్గానికి చెందిన యువకులు కొందరు తగాదా పడ్డాక దాదాపు 500 మంది మూక ఔరంగాబాద్‌లో పోలీసులపై దాడికి దిగారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన కిరాద్‌పురాలో బుధవారం రాత్రి జరిగింది. అక్కడ రాముడి గుడిని పునరుద్ధరించారు. ఇరుపక్షాలకు చెందిన యువకులు నినాదాలు చేస్తూ ఒకరిపైమరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇది కాస్త చిలికిచిలికి హింసకు దారితీసింది. కిరాద్‌పురాలో మస్జిదు బయట పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ను పెట్టడంతో గొడవ ముదిరిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పోలీసు వాహనాలతో సహా దాదాపు 20 వాహనాలు దగ్ధం అయ్యాయని తెలిసింది. ఎస్‌ఆర్‌పిఎఫ్ బృందాలను వెంటనే ఘటనాస్థలికి తరలించారు.
పోలీసులు లాఠిచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అదనపు బలగాలను వినియోగించారు. ‘దాడిలో ఐదు వందల నుంచి ఆరు వందల మంది వరకు పాల్గొన్నారు. యువకులు గొడవపడ్డాక ఇదంతా జరిగింది. అల్లర్లకు పాల్పడిన వారిని పట్టుకునే కొంబింగ్ ఆపరేషన్ మొదలెట్టాము’ అని పోలీస్ కమిషనర్ నిఖిల్ గుప్తా తెలిపారు. గొడవల్లో ఎంత మంది గాయపడ్డారన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ముస్లింలు రంజాన్ ఉపవాసాలు పాటిస్తున్న సందర్భంలో, శ్రీరామ నవమి రావడంతో, రెండు పక్షాల యువకులు గొడవపడ్డంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిందని తెలిసింది.
#Maharashtra | A clash broke out between two groups in Chhatrapati Sambhajinagar's #Kiradpura area
Stones were pelted, some private & police vehicles were set on fire. Police used force to disperse the people and now the situation is peaceful. Police will take strict action… pic.twitter.com/vVoQK2chZk
— Subodh Kumar (@kumarsubodh_) March 30, 2023