మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని పటేల్ నగర్ పరిసరాల్లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో రామ నవమి శుభ సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావి పైకప్పు కూలి 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను కాపాడాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఇండోర్ జిల్లా కలెక్టర్, కమిషనర్‌ను ఆదేశించారు. “ఇది దురదృష్టకర సంఘటన. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇతర వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని సీఎం చౌహాన్‌ను పేర్కొన్నారు.
#WATCH | Madhya Pradesh: Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore.
Details awaited. pic.twitter.com/qfs69VrGa9
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023