Friday, December 20, 2024

కాలేజీ భవనం పైనుంచి దూకిన ఎంబిబిఎస్ విద్యార్థి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్ విద్యార్థి ఫక్కీర్ మోహన్ మెడికల్ కాలేజీ-ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒడిశా రాష్ట్రం బాలాసోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భిమ్‌పూర్ గ్రామానికి చెందిన హితేన్షు దాస్ అనే యువకుడు ఫక్కీర్ మోహన్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ థర్డ్ ఇయిర్ చదువుతున్నారు. గురువారం రాత్రి కాలేజీ భవనం పైనుంచి దాస్ దూకాడు.

రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆస్పత్రికి తోటి విద్యార్థులు తరలించారు. తీవ్రంగా గాయపడడంతో దాస్ చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. దాస్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదు. ఆన్‌లైన్ క్లాస్ మధ్యలో నుంచి దాస్ వెళ్లిపోయాడు, తోటి విద్యార్థులు, ప్రొఫెసర్స్, తల్లిదండ్రుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రేమలో విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకున్నారా? లేక కాలేజీలో ఎవరైనా వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News