- Advertisement -
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ మెడికల్ కాలేజీలో వరుస ఆత్మహత్యల కలకలం సృష్టిస్తున్నాయి. మెడికల్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబిబిఎస్ థర్డ్ ఇయర్ విద్యార్థి సనత్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇదే హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -