- Advertisement -
చండీగఢ్: కాంగ్రెస్ నాయకుడు నవజోత్ సింగ్ సిధు రేపు (ఏప్రిల్ 1) పాటియాల జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయన న్యాయవాది హెచ్‌పిఎస్. వర్మ శుక్రవారం ఈ విషయం చెప్పారు. 59 ఏళ్ల నవజోత్ 1988లో ఓ రోడ్డు మీద గొడవపడ్డాడు. ఆ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది. గత ఏడాది మే 20న సిధు పాటియాల కోర్టు ముందు లొంగిపోయారు. దానికి ముందు సుప్రీంకోర్టు ఆయనకు ఏడాదిపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. నాడు జరిగిన రోడ్డు గొడవలో 65 ఏళ్ల గుర్నామ్ సింగ్ చనిపోయాడు. జైలు జీవితంలో మంచి ప్రవర్తన కనబరిచిన వారికి సాధారణ ఉపశమనం (జనరల్ రెమిషన్) ఉంటుందని ఆయన న్యాయవాది వర్మ తెలిపారు. ‘పాటియాల జైలు నుంచి ఆయన శనివారం విడుదల అవుతారు’ అని వర్మ స్పష్టం చేశారు.
- Advertisement -