Monday, December 23, 2024

‘ఊరు పేరు భైరవకోన’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’  ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ ‘నిజమేనే చెబుతున్నా’ విడుదల చేశారు మేకర్స్. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై చిత్రీకరించిన బ్రీజీ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. శేఖర్ చంద్ర సంగీతం సారథ్యంలో శ్రీమణి సాహిత్యం అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించారు. కావ్య థాపర్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News