Monday, December 23, 2024

నూతన బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ : ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి వయా మోర్గి, చింకోడ్ మీదుగా బీదర్ వరకు ప్రత్యేక బస్సును ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి శుక్రవారం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… చూట్టు పక్కల గ్రామాల ప్రజలు బస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజు నాలుగు ట్రిప్పులు తింపడం జరుగుతుందని ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ మార్కెటింగ్ సెల్ ఇంచార్జి పాండు, డ్రైవింగ్ ఇన్స్‌పెక్టర్ భాస్కర్, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News