- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ జట్టుతో జరుగుతున్న తొలి ఐపిఎల్ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(92) మెరుపు బ్యాటింగ్ తో అలరిస్తున్నాడు.
మిగతా ఆటగాళ్లు అతనికి అండగా నిలబడలేకపోతున్నారు. మొయిన్ అలీ(23), అంబటి రాయుడు(12), కాన్వే(1), బెన్ స్టోక్స్(7)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పర్చారు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్, జోసెఫ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.
- Advertisement -